మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (21:57 IST)

ఎదురుగా బాబాయ్ కళ్యాణ్ వుంటే... రంగస్థలం విజయోత్సవ వేడుకలో చెర్రీ

రంగస్థలం విజయోత్సవ వేడుక హైదరాబాదులో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ... " చాలా మాట్లాడాలని అనుకున్నాను. కానీ మాటలు రావడం లేదు. సుకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రానికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల రియాక్షన్ నే

రంగస్థలం విజయోత్సవ వేడుక హైదరాబాదులో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ... " చాలా మాట్లాడాలని అనుకున్నాను. కానీ మాటలు రావడం లేదు. సుకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రానికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల రియాక్షన్ నేను చెప్పాలి.
 
మమ్మీ, డాడీల రియాక్షన్. కంట్లో నీళ్లు పెట్టుకుని చాలా బాగా చేశావని మమ్మీ చెప్పింది. బాబాయి ఇంటికెళ్లి చెపుదామని అనుకున్నాను. ఐతే ఆయనే నాకు ఫోన్ చేసి చాలా బాగా చేశావురా అని చెప్పారు. సినిమా చూడాలని అన్నారు. ప్రివ్యూ థియేటర్లో కాదు... జనాలతో చూడాలన్నారు.

తొలిప్రేమ చిత్రం తర్వాత రంగస్థలం చిత్రమే థియేటర్లో చూసినట్లు చెప్పారు... అంటూ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు రామ్ చరణ్. మాటల తడబాటుగా ఎన్టీవీ చౌదరి అనడానికి బదులు టీవీ9 చౌదరి అంటూ నవ్వేశారు. రేపు ఇదే రాస్తారా ఏంటి అని నవ్వేశారు.