శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (16:12 IST)

నేను రేప్ బాధితురాలినే.. కథువా బాలిక చనిపోయింది... నేను జీవించివున్నా...

భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోమారు స్పందించారు. తాను కూడా అత్యాచార బాధితురాలినేనంటూ చెప్పుకొచ్చింది. అంతేనా... కథువా రేప్ బాలిక చనిపోయింది.. నేను మాత్రం జీవించే ఉన్నాను.. అ

భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోమారు స్పందించారు. తాను కూడా అత్యాచార బాధితురాలినేనంటూ చెప్పుకొచ్చింది. అంతేనా... కథువా రేప్ బాలిక చనిపోయింది.. నేను మాత్రం జీవించే ఉన్నాను.. అంతేతేడా అంటూ వాపోయింది.
 
గత కొన్ని రోజులుగా జహాన్ కట్టుకున్న భర్త షమీపై పలు రకాల విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆమె స్పందిస్తూ, తన భర్తకు, తనకూ మధ్య ఉన్న విభేదాలను కథువా హత్యాచార ఘటనకు సరిపోల్చదగినవిగా ఉన్నట్టు చెప్పారు. 
 
తాను కూడా కథువా బాధితురాలి మాదిరిగానే లైంగిక వేధింపులు అనుభవించానని, ఆ ఘటనలో ఏం జరిగిందో తన జీవితంలోనూ దాదాపు అదే జరిగిందని చెప్పింది. తనను రేప్ చేయాలని షమీ కుటుంబీకులు ప్రయత్నించారని, ఆపై చంపేసి చెత్తకుప్పలో మృతదేహాన్ని పడేయాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు.