సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (13:00 IST)

సమస్త దోషాలు తొలగిపోయేందుకు ఇలా పూజలు చేస్తే..

పార్వతీ పరమేశ్వరుల కూమారునిగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తుంటారు. తారకాసురుడి సంహారం కోసం, లోక కల్యాణం కోసమే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్టి రోజు

పార్వతీ పరమేశ్వరుల కూమారునిగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తుంటారు. తారకాసురుడి సంహారం కోసం, లోక కల్యాణం కోసమే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్టి రోజునే సుబ్రహ్మణ్య షష్టిగా పిలుస్తుంటారు. ఈ స్వామిని కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ అని కూడా పిలుస్తుంటారు.
 
అలానే సుబ్రహ్మణ్య షష్టిని కార్తికేయ షష్టి, కుమార షష్టి, స్కంద షష్టి వంటి పేర్లతో పిలుస్తుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అంతేకాకుండా అభిషేకాలు చేయవలసి ఉంటుంది. స్వామి వారికి ఇష్టమైన పండ్లను, పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున స్వామి వారిని ఆరాధించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలలో చెబుతున్నారు.