మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (16:22 IST)

కృష్ణునికి నైవేద్యంగా ఏం పెట్టాలో తెలుసా?

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గ్రామాలలో కృష్ణుడిని పూజిస్తుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యంగా మీగడ, వెన్నను సమర్పించాలి. ధర్మాన్ని అంటిపెట్టుకుని తనని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలిచాడు కృ

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గ్రామాలలో కృష్ణుడిని పూజిస్తుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యంగా మీగడ, వెన్నను సమర్పించాలి. ధర్మాన్ని అంటిపెట్టుకుని తనని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలిచాడు కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు తోడుగా నిలబడి వాళ్లకి విజయం చేకూరేలా చేశాడు. పేదరికంతో బాధపడుతున్న కృష్ణుని చిన్ననాటి స్నేహితుడైన సుధామునికి సిరిసంపదలను అనుగ్రహించాడు.
 
స్నేహం అంటే ఎలా ఉండాలనే విషయాన్ని తన స్నేహితుని ద్వారా భక్తులందరికి తెలియజేశాడు కృష్ణుడు. అంతేకాకుండా గోవర్ధన గిరిని పైకెత్తి అక్కడి ప్రజలకు రక్షణగా నిలబడ్డాడు. అలాంటి కృష్ణుని నామాలను స్మరిస్తూ క్షేత్రాలను, ఆలయాలను దర్శించుకోవడం వలన సకల పాపాలు, దోషాలు తొలగిపోయి సకల సౌభ్యాగాలు, సిరసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెబుతున్నారు.