మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (14:51 IST)

అమావాస్య పుష్యమి నక్షత్రం రోజూ ఇలా పూజలు చేస్తే..?

అపురూపమైన ఆధ్యాత్మిక వస్తువులలో శ్వేతార్క మూలం చాలా విశిష్టమైనది. ఇక్కడ శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. ఈ మూలాన్ని గణపతి స్వరూపంగా పరిగణిస్తారు. శ్వేతార్క గణపతిని పూజించడం వలన జాతకంలో గల కేతు

అపురూపమైన ఆధ్యాత్మిక వస్తువులలో శ్వేతార్క మూలం చాలా విశిష్టమైనది. ఇక్కడ శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. ఈ మూలాన్ని గణపతి స్వరూపంగా పరిగణిస్తారు. శ్వేతార్క గణపతిని పూజించడం వలన జాతకంలో గల కేతు గ్రహ దోషాలు, వీటి వలన ఏర్పడే అనవసర భయాలు తొలగిపోతాయి. ఆదివారం నాడు అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు శ్వేతార్క మూలాన్ని సేకరించడం అత్యంత శ్రేష్టం.

 
ఈ మూడింటిలో ఏ రెండు కలసి వచ్చిన ఆ రోజు ఉదయాన్నే శ్వేతార్క మూలాన్ని పూజించడం మంచిది. మట్టి నుండి తవ్వి సేకరించిన శ్వేతార్క మూలాన్ని మంచినీటితో శుభ్రం చేయాలి. తరువాత దీన్ని పూజమందిరంలో ఎర్రని వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. ముఖ్యంగా శ్వేతార్క గణపతి పూజలో ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షతలు, రక్తచందనం వంటివి ఉపయోగించాలి.