సాయిబాబాకు విష్ణు సహస్ర నామ పారాయణకు సంబంధం ఏంటి?  
                                          విష్ణు సహస్ర నామ పారాయణాన్ని సాయిబాబా ఎంతగానో ప్రోత్సహించేవారట. భక్తులకు అనేకసార్లు విష్ణు సహస్ర నామాలను స్తుతించమని చెప్పేవారట. సాయి సచ్చరిత్రలో బాబా తన భక్తులను విష్ణు సహస్ర నామ జపం గొప్పదనం గురించి
                                       
                  
				  				  
				   
                  				  విష్ణు సహస్ర నామ పారాయణాన్ని సాయిబాబా ఎంతగానో ప్రోత్సహించేవారట. భక్తులకు అనేకసార్లు విష్ణు సహస్ర నామాలను స్తుతించమని చెప్పేవారట. సాయి సచ్చరిత్రలో బాబా తన భక్తులను విష్ణు సహస్ర నామ జపం గొప్పదనం గురించి రామదాసు ద్వారా తెలియజేశారట. శ్యామా అనే భక్తునికి సాయిబాబా విష్ణు సహస్ర నామాలను ప్రసాదంగా ఇచ్చారట. 
	
				  
	 
	విష్ణు సహస్ర నామము భగవద్గీతకు తర్వాత ముఖ్యమైనది. ఇది సకల పాపాల నుంచి, దురాలోచనల నుంచి, చావుపుట్టుకల నుంచి తప్పిస్తుంది. విష్ణు సహస్ర నామ పారాయణతో భయాందోళనలు తొలగిపోతాయని భీష్మాచార్యుడు నమ్మేవారు. అలాంటి విష్ణు సహస్ర నామాన్ని ప్రతిరోజూ పఠించేవారు లేదా వినేవారికి లక్ష్య సాధన సులువవుతుంది. 
				  											
																													
									  
	 
	అంతేగాకుండా దారిద్ర్య బాధలను విష్ణు సహస్ర నామ పారాయణ తొలగిస్తుంది. అదృష్టాన్నిస్తుంది. సమస్త దోషాలను తొలగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధినిస్తుంది. విష్ణు సహస్ర నామ పారాయణతో ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతికూలతలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫలితంగా జీవితంలో లక్ష్య సాధనకు మార్గం సుగుమమవుతుంది. 
				  
	 
	ఇంకా విష్ణు సహస్ర నామ పారాయణ మానసిక ఆవేదనలను ఏమాత్రం దరిచేర్చదు. జీవితంలో అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి విష్ణు సహస్ర నామ పారాయణతో పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.