నువ్వులతో అధిక బరువుకు చెక్...
నువ్వుల్లో విటమిన్ ఇ, బి, బి1, ఫైబర్, జింక్, పాస్పరస్, ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర నొప్పులను తగ్గించుటకు మంచిగా పనిచేస్తాయి. ఎముకల బలానికి చక
నువ్వుల్లో విటమిన్ ఇ, బి, బి1, ఫైబర్, జింక్, పాస్పరస్, ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర నొప్పులను తగ్గించుటకు మంచిగా పనిచేస్తాయి. ఎముకల బలానికి చక్కని ఔషధంగా ఉపయోగపడుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. రక్తపోటు వంటి సమస్యలలో బాధపడుతున్నవారు ప్రతిరోజు నువ్వులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పిల్లల పెరుగుదలకు అవసరమయ్యే ఎమినో యాసిడ్స్ నువ్వుల్లో పుష్కలంగా ఉన్నాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు మంచిగా ఉపయోగపడుతాయి. అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. నువ్వుల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి రక్తహీనతను తగ్గిస్తాయి.