ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (13:27 IST)

సగ్గుబియ్యంతో కిచిడీ ఎలా చేయాలో తెలుసా?

సగ్గుబియ్యంలో విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం, ఐరన్, వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎముకల బలానికి సగ్గుబియ్యం దివ్యౌషధంగా పనిచేస్తాయి. రక్తపోటు వంటి సమస్యల నుండి కాపాడుతుంది. శరీర వేడిని తగ్గించుటకు సగ్గుబియ్యం మంచిగా ఉపయోగపడుతాయి. ఇటువంటి సగ్గుబి

సగ్గుబియ్యంలో విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం, ఐరన్, వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎముకల బలానికి సగ్గుబియ్యం దివ్యౌషధంగా పనిచేస్తాయి. రక్తపోటు వంటి సమస్యల నుండి కాపాడుతుంది. శరీర వేడిని తగ్గించుటకు సగ్గుబియ్యం మంచిగా ఉపయోగపడుతాయి. ఇటువంటి సగ్గుబియ్యంతో కిచిడీ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు: 
సగ్గుబియ్యం - 2 కప్పులు 
వేగించిన పల్లీలు - అర కప్పు
పచ్చిమిర్చి - 6 
నూనె - పావు కప్పు 
కొత్తిమీర తరుగు - కొద్దిగా 
పసుపు, ఉప్పు - తగినంత 
టమోటా - 1
బంగాళాదుంప - 1
 
తయారీ విధానం:
ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా కడుక్కుని నీరు లేకుండా డ్రై చేసి గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు వేయించిన పల్లీలలో పచ్చిమిర్చి, ఉప్పు కలుపుకని మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా నీళ్లు కలుపుకుని సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి. బాణలిలో నూనెను పోసి వేడయ్యాక అందులో ఆ మిశ్రమాన్ని వేసి సన్నని మంటపై అరగంటపాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత ఉడికించిన బంగాళాదుంపలు, టమోటా ముక్కలు వేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తమీరు చల్లుకుంటే వేడివేడి సగ్గుబియ్యం కిచిడీ రెడీ.