శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (15:14 IST)

క్యాప్సికమ్ సూప్ ఎలా చేయాలో చూద్దాం...

మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యాప్సికమ్‌ను తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను సులువుగా తగ్గించుకోవచ్చును. ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పిత్తి చేసే చర్యలను క్యాప్సికమ్ ప్రోత్సహిస్తుంది. క్యాప్సికమ్‌లోని విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఆస్తమాను

మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యాప్సికమ్‌ను తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను సులువుగా తగ్గించుకోవచ్చును. ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పిత్తి చేసే చర్యలను క్యాప్సికమ్ ప్రోత్సహిస్తుంది. క్యాప్సికమ్‌లోని విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఆస్తమాను తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఇటువంటి క్యాప్సికమ్‌తో సూప్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
టమోటాలు - 6
దోసకాయలు - 2
కొత్తిమీర - 4 కాడలు
రెడ్, గ్రీన్ క్యాప్సికం - 2
నూనె - తగినంతా
మిరియాల పొడి - కొద్దిగా
ఉప్పు - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా టమోటాలను, దోసకాయలను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికరంలోని గింజల్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కూరగాయల నన్నింటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో మిరియాలపొడి, ఉప్పు, నీరు వేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే... క్యాప్సికమ్ సూప్ రెడీ.