కొత్తిమీరతో సూప్ ఎలా చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు: కొత్తమీర తరుగు - 2 కప్పులు బటర్ - 1 స్పూన్ బిర్యాని ఆకు - 1 దాల్చిన చెక్కలు - 2 బంగాళాదుంపలు - 2 పాలు - అరకప్పు నీళ్ళు - 2 కప్పులు తయారీ విధానం: ముందుగా బాణలిలో బటర్‌ను కరిగించుకు
కావలసిన పదార్థాలు:
కొత్తమీర తరుగు - 2 కప్పులు
బటర్ - 1 స్పూన్
బిర్యాని ఆకు - 1
దాల్చిన చెక్కలు - 2
బంగాళాదుంపలు - 2
పాలు - అరకప్పు
నీళ్ళు - 2 కప్పులు
తయారీ విధానం:
ముందుగా బాణలిలో బటర్‌ను కరిగించుకుని బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, బంగాళదుంప ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేగించుకోవాలి. తరువాత కొత్తమీర తరుగు వేసుకుని మంట తగ్గించుకుని పాలు పోసుకుని 2 నిమిషాల తరువాత దించేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో 2 కప్పుల నీటిని పోసుకుని కాసేపు మరిగించుకోవాలి. అంతే వేడివేడి కొత్తిమీర సూప్ రెడీ.