1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with lemon and vinegar

మల్లి ఆకులను మెత్తగా పేస్టులా చేసి అక్కడ రాసుకుంటే?

పాదాల పగుళ్లు తొలిగిపోవాలంటే మల్లి ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన పాదాల పగుళ్లు తొలగిపోతాయి. పుట్టుమచ్చలు పోవాలంటే పచ్చి ధనియాలు నూరి ఆ మచ్చల మీద రా

lemon
పాదాల పగుళ్లు తొలిగిపోవాలంటే మల్లి ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన పాదాల పగుళ్లు తొలగిపోతాయి. పుట్టుమచ్చలు పోవాలంటే పచ్చి ధనియాలు నూరి ఆ మచ్చల మీద రాసుకోవాలి. ఇలా చేస్తే పుట్టుమచ్చలు పోతాయి.
 
నిమ్మరసంలో కొద్దిగా వెనిగర్‌ను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు నల్లగా మారుతుంది. పెదాలు మృదువుగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు మీగడను రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. పెరుగులో కొద్దిగా శెనగపిండిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. తద్వార మెుటిమలు తగ్గుతాయి. 
 
గంధాన్ని రోజ్ వాటర్‌లో కలుపుకుని ముఖానికి రాసుకుంటే ముఖం మీద గల రాషెస్ పోతాయి. గంధంలో హారతి కర్పూరాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే మెుటిమలు తగ్గిపోతాయి. నిమ్మరసంలో అల్లం రసం, పెరుగును కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా కాంతివంతంగా కూడా మారుతుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఈ వంటింటి చిట్కాలు మీకోసం...