1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
  4. SLT pains removes tips

చిగుళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే?

దంతాల మధ్య సందులు ఏర్పడడం, వాటి మధ్యలో ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం వంటి సమస్యల వలన దంతాలు, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు చాలా అధికమవుతున్నాయి. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఈ చిట్కాలు పాటిస్తే

slt
దంతాల మధ్య సందులు ఏర్పడడం, వాటి మధ్యలో ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం వంటి సమస్యల వలన దంతాలు, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు చాలా అధికమవుతున్నాయి. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
ఐస్ క్యూబ్స్‌ను ఒక బట్టలో మూటలా కట్టుకుని దానిని దవడపై పెట్టుకుంటే దంతాలు, చిగుళ్ల నొప్పులు దగ్గుతాయి. అలానే గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఉప్పును కలుపుకుని ఆ నీటిని తీసుకుంటే మంచిది. చిగుళ్ల నొప్పికి వెల్లుల్లిని లేదా ఉల్లిపాయను నలిపి చిగుళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన నొప్పులు తొలగిపోతాయి. అంతేకాకుండా దంతాలు దృఢంగా ఉంటాయి. 
 
గోధుమ గడ్డి రసాన్ని దంతాల నొప్పులకు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఈ రసాన్ని చిగుళ్లపై రాసుకుంటే మంచి ఫలితముంటుంది. నిమ్మకాయను పొట్టును నలిపితే కూడా దంతాల నొప్పులు దగ్గుతాయి. ఇంగులో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని చిగుళ్లకు రాసుకుంటే తక్షణమే అలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.
About Writer
Kowsalya
తర్వాతి కథనం
బేబీ కార్న్‌ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం...