మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (12:24 IST)

వేపాకులను నీటిలో మరిగించి తీసుకుంటే?

శరీర రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వేప ఆకులలో పుష్కలంగా ఉన్నాయి. ఈ వేపాకులను టీలో వేసి మరిగించి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేపాకులో యాంటీ వైరల్, యాం

శరీర రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వేప ఆకులలో పుష్కలంగా ఉన్నాయి. ఈ వేపాకులను టీలో వేసి మరిగించి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేపాకులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి. విష జ్వరాలను నుండి విముక్తి కలిగిస్తుంది.
 
వేపాకులను కడిగి వాటిని ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని పొడిచేసి ప్రతిరోజూ తేనెలో కలుపుకుని తీసుకుంటే శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తీసుకోవడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ వేపాకులను పేస్ట్‌లా చేసుకుని కీళ్ల నొప్పులకు రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
వేపాకులను నీటిలో మరిగించి చల్లారిన తరువాత తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా నోట్లోని క్రిములు నశిస్తాయి. దంతాలు దృఢంగా ఉంటాయి. అగే నీటితో కళ్లను కడుక్కుంటే కంటి దురదలు తగ్గుతాయి. కళ్ల కలక వచ్చిన వారు ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. వేపాకులను నూరి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి.
 
కాసేపటి తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు, మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. అలానే ఆ పేస్ట్‌ను గాయాలకు, దెబ్బలకు, పుండ్లపై రాసుకుంటే త్వరగా తగ్గుముఖం పడుతాయి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు, దురద సమస్యలు ఉండవు. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.