గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (16:23 IST)

కరుణానిధి ఆరోగ్యం క్రిటికల్... సీఎం పళనిస్వామితో స్టాలిన్ భేటీ... అందుకేనా?

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన ఆరోగ్యంపై మంగళవారం సాయంత్రం 6 గంటలకు వైద్య బులిటెన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పళనిస్వామితో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెం

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన ఆరోగ్యంపై మంగళవారం సాయంత్రం 6 గంటలకు వైద్య బులిటెన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పళనిస్వామితో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే.స్టాలిన్ అత్యవసరంగా భేటీ అయ్యారు.
 
స్థానిక చెన్నై, గ్రీన్‌వేస్ రోడ్డులోని ముఖ్యమంత్రి పళనిస్వామి అధికారిక నివాసానికి వెళ్లిన స్టాలిన్.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఇద్దరు ప‌లు అంశాల‌పై అర్థగంటపాటు చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానంగా చెన్నైలోని మెరీనా బీచ్‌లో కరుణ స్మారక చిహ్నం నిర్మించేందుకు స్థలం కేటాయించాల్సిందిగా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కరుణానిధి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు వెల్లడించారు. వైద్యుల ప్రకటనతో కరుణ అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చూసేందుకు పోలీసు సిబ్బందిని విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.