ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (11:10 IST)

కావేరీలో కరుణ... షాక్‌తో 21మంది డీఎంకే కార్యకర్తలు మృతి

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి (94) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. డీఎంకే అధినేత అయిన కరుణ ఆస్పత్రిలో పాలయ్యారనే విషయాన్ని జీర్ణించుకోలేని డీఎంకే కార్యకర్తలు 21 మంది మృ

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి (94) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. డీఎంకే అధినేత అయిన కరుణ ఆస్పత్రిలో పాలయ్యారనే విషయాన్ని జీర్ణించుకోలేని డీఎంకే కార్యకర్తలు 21 మంది మృతి చెందినట్లు డీఎంకే కార్యకర్తలు 21 మంది మృతి చెందినట్లు డీఎంకే తెలిపింది. కరుణ ఆసుపత్రి పాలవడాన్ని తట్టుకోలేక 21 మంది మృతి చెందిన విషయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ మరణాలు తనను బాధించాయని స్టాలిన్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కానీ బలవన్మరాలకు పాల్పడిన వారి వివరాలను ఆయన బయటపెట్టలేదు. కాగా, గత  ఐదు రోజులుగా కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం కుదుటపడుతున్నట్టు స్టాలిన్ తెలిపారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని స్టాలిన్ చెప్పారు.
 
కాగా.. చెన్నైలోని అళ్వార్ పేట్‌లోని కావేరీ ఆసుపత్రిలో ఐదు రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న కరుణను పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కరుణను పరామర్శించారు. అంతకుముందు కోలీవుడ్ టాప్ హీరోలు విజయ్, అజిత్‌లు కరుణను పరామర్శించేందుకు కావేరీ ఆస్పత్రికి వచ్చారు.