గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (15:56 IST)

పగలు రాత్రి... ఏసీ గదుల్లో ఉంటున్నారా...

చాలామంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏసీ గుదుల్లోనే ఉంటుంటారు. అది వేసవి కాలమైనా.. శీతాకాలమైనా సరే. అదేపనిగా ఏసీలో ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ

చాలామంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏసీ గుదుల్లోనే ఉంటుంటారు. అది వేసవి కాలమైనా.. శీతాకాలమైనా సరే. అదేపనిగా ఏసీలో ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఇపుడు తెలుసుకుందాం.
 
* నిరంతరం ఏసీ గదుల్లో ఉండటం వల్ల సహజంగానే కళ్లు పొడిబారతాయి. కళ్లలో స్రవించే ద్రవాల పరిమాణం తగ్గుతుంది. అందువల్ల కళ్లు పొడిబారిపోయి దురద, మంటపెడతాయి. 
* గంటల కొద్దీ ఏసీలో ఉండేవారికి చర్మ పొడిబారిపోయి దురదపెడుతుంది. ఏసీ కింద ఉండి ఎండలోకి వెళితే చర్మం మరింతగా పొడిబారుతుంది. దీంతో చర్మ దురద సమస్య మరింతగా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 
* ఏసీ వల్ల గదిలో ఉండే తేమ శాతం తగ్గుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. నీళ్లు బాగా తాగాలనిపిస్తుంది.
* పొద్దస్తమానం ఏసీలో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ముక్కు, గొంతు, కళ్లు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయి. 
* గొంతు పొడిబారిపోతుంది. ముక్కు రంధ్రాలు పూడుకుపోతాయి. 
* ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏసీల్లో అస్సలు ఉండరాదు. లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుంది.
* ఏసీల్లో ఉండే వారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది మైగ్రేన్‌కు కూడా దారితీయొచ్చు.