శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (17:24 IST)

ఏసీ లేకుండా వుండలేకపోతున్నారా?

ఏసీల్లో గంటల పాటు గడుపుతున్నారా? అయితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీల కింద గంటల తరబడి గడిపే వారికి చర్మం పొడిబారిపోవడం ద్వారా అలెర్జీ సమస్యలు తప్పవు. ఏసీ వల్ల గదిలో ఉ

ఏసీల్లో గంటల పాటు గడుపుతున్నారా? అయితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీల కింద గంటల తరబడి గడిపే వారికి చర్మం పొడిబారిపోవడం ద్వారా అలెర్జీ సమస్యలు తప్పవు. ఏసీ వల్ల గదిలో ఉండే తేమ శాతం తగ్గుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. నీళ్లు అధికంగా సేవించాల్సి వుంటుంది. తద్వారా అధిక మోతాదులో నీటిని శరీరానికి అందించినట్లవుతుంది.
 
దాహం అయినప్పుడే నీళ్లు తాగిన వారి శరీరంలో నీటి శాతం సమతూకంగా ఉంది. దాహం లేకపోయినా నీళ్లు తాగితే.. మొదట మెదడు చురుగ్గా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా నీరు విషంగా మారి మెదడుపై ఎఫెక్ట్ చూపుతుంది. 
 
అలాగే కళ్లు పొడి బారిపోయే సమస్య ఉన్న వారు ఏసీల కింద కూర్చోకూడదని.. దాని వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. ఏసీల కింద ఉండడం వల్ల సహజంగానే కళ్లు పొడిబారతాయి. కళ్లలో స్రవించే ద్రవాల పరిమాణం తగ్గుతుంది. అందువల్ల కళ్లు పొడిబారిపోయి దురదలు పెడతాయి. కనుక అంతకు ముందే ఆ సమస్య ఉన్నవారు ఏసీల కింద కూర్చోకపోవడమే ఉత్తమం. అలా కూర్చోక తప్పని పరిస్థితుల్లో అరగంటకు ఒకసారి ఏసీ నుంచి బయటికి రావడం పచ్చని చెట్లను చూడటం చేయాలి. 
 
గంటల తరబడి ఏసీలో ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ముక్కు, గొంతు, కళ్లు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి. గొంతు పొడిబారిపోతుంది. ముక్కు లోపలి భాగంలో ఉండే మ్యూకస్ పొర వాపునకు లోనవుతుంది. ఏసీల్లో ఉండే వారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అది మైగ్రేన్‌కు కూడా దారి తీయవచ్చు. ఏసీల్లో ఉండడం వల్ల కలిగే డీహైడ్రేషన్ సమస్యే తలనొప్పికి కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.