ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Kowsalya
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (12:37 IST)

మైదాపిండితో చక్కెర, కొబ్బరితురుము చపాతీ తయారీ విధానం....

మైదాపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, పొటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి మైదాపిండితో ఒక రుచికరమైన వంటకం క్రింది తెలుపబడెను. అది ఎలా తయారుచేయాలో చూద్దాం.

మైదాపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, పొటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి మైదాపిండితో ఒక రుచికరమైన వంటకం. అది ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 100 గ్రాములు
నీళ్లు - సరిపడా
చక్కెర - తగినంత
కొబ్బరి తురుము - 1 కప్పు
 
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో మైదాపిండిని వేసి నీళ్లతో చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ పిండిని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత ఆ పిండిని ఉండలుగా చేసుకుని చపాతీలా రుద్దుకోవాలి. ఇప్పుడు బాణలిలో నీళ్లను పోసి వేగయ్యాక ముందుగా రుద్దుకున్న వాటిని ఆ వేడి నీళ్లల్లో వేసి కాసేపు తరువాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని వాటిని కాసేపు ఆరనివ్వాలి. ఆరిన తరువాత ఒక్కొక్క చపాతీలో కాస్త చక్కెర, కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. అంతే మైదాపిండితో చక్కెర చపాతీ రెడీ. ఈ వంటకాన్ని మల్లీదా అని కూడా అంటారు.