మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (14:40 IST)

రాత్రి నిద్రపోయే ముందు ఇవి ఆరగిస్తున్నారా?

రాత్రి బెడ్ ఎక్కగానే నిద్ర పట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, చాలా మందికి పడుకున్న తర్వాత కొన్ని గంటలు గడిచినా నిద్రపట్టదు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ఈ కారణాల్లో ఒకటి మనం తీసుకునే ఆహారం. రా

రాత్రి బెడ్ ఎక్కగానే నిద్ర పట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, చాలా మందికి పడుకున్న తర్వాత కొన్ని గంటలు గడిచినా నిద్రపట్టదు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ఈ కారణాల్లో ఒకటి మనం తీసుకునే ఆహారం. రాత్రిళ్లు మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల నిద్ర ప‌ట్ట‌డం ఆల‌స్యమవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
మద్యం, కార్బొనేటెడ్ డ్రింక్స్, టీ, కాఫీలు వంటివి తీసుకోవడం వల్ల నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. బాత్‌రూమ్‌కు ఎక్కువగా వెళ్లేలా చేస్తాయి. టీ, కాఫీల వంటివి తీసుకుంటే అసిడిటీ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణంకాదు. అలాగే, చిల్లీ, టమాటో సాస్‌లను తీసుకున్నట్టయితే జీర్ణప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. గ్యాస్ ట్రబుల్ సమస్యను ఉత్పన్నం చేస్తుంది. పీచు పదార్థాలు అధికంగా కలిగిన కూరలకు కూడా దూరంగా ఉండటం మంచిది.
 
అవి రకాల టాపింగ్స్‌తో, ఫ్లేవర్స్‌తో లభ్యమయ్యే నోరూరించే రుచికరమైన పిజ్జా లేదా బర్గర్‌లను రాత్రి పూట తినకూడదు. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రాత్రి తింటే జీర్ణప్రక్రియ నెమ్మదిస్తుంది. పైగా, గ్యాస్ సమస్యలు, గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. 
 
చాక్లెట్లు, స్వీట్స్, క్యాండీలు వంటివి ఇష్టపడని వారుండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు వీటి తియ్యని రుచిని ఆస్వాదిస్తారు. అయితే వీటిని రాత్రి తినకూడదు. తింటే అలసటకు లోనవుతారు. చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. పైగా, గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. ఫలితంగా నిద్రకు భంగం కలుగుతుంది.