మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (10:22 IST)

రాత్రివేళ డిన్నర్ ఆలస్యంగా చేస్తున్నారా?

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రించడం లేదంటే బాగా ఆలస్యంగా నిద్రించడం వలన అధికంగా బరువు పెరుగే అవకాశాలున్నాయి. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ముంది. అందు

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రించడం లేదంటే బాగా ఆలస్యంగా నిద్రించడం వలన అధికంగా బరువు పెరుగే అవకాశాలున్నాయి. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ముంది. అందువలన రాత్రివేళ వీలైనంత వరకు త్వరగా భోజనం చేయాలని, భోజనం చేశాక 2 గంటలు తరువాత నిద్రించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
చాలామంది రాత్రిపూట భోజనం ఆలస్యంగానే చేస్తుంటారు. అలాంటి వారికి అనారోగ్య సమస్యలే కాకుండా క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదాలున్నాయి. రాత్రిపూట 9 గంటల తరువాత భోజనం చేసే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ 9 లోపు భోజనం చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 26 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. 
 
అలాకాకుంటే ఇంగా ముందే భోజనం చేస్తే ఆ అవకాశం 16 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలో తెలియజేశారు. అందువలన రాత్రిపూట ఎంత త్వరగా భోజనం చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది. ఈ సైంటిస్టులు పరిశోధనకు ఎంచుకున్న వారిలో 621 మంది పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్, 1205 మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లుగా తెలిసింది. కాబట్టి రాత్రిపూట భోజనం వీలైనంత వరకు త్వరగా చేస్తే ఇలాంటి సమస్యలు దరిచేరువు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.