శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (10:52 IST)

పరగడుపున రాగి చెంబులో నీళ్లు తాగితే?

రాగి పాత్రలను ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రాగి పాత్రలో కేవలం మూడు గంటల పాటు నీటిని నిల్వ వుంచితే చాలు.. ఆ నీటిలో వుండే క్రిములు నశిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. త

రాగి పాత్రలను ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రాగి పాత్రలో కేవలం మూడు గంటల పాటు నీటిని నిల్వ వుంచితే చాలు.. ఆ నీటిలో వుండే క్రిములు నశిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది. రాగి పాత్ర‌ల‌లో నీటిని నిల్వ ఉంచ‌డం వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ-కొలి బాక్టీరియా కూడా అంతమ‌వుతుంది. 
 
దీని వ‌ల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె స‌మ‌స్య‌లు రావు. క్యాన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెర‌గ‌వుతుంది. ర‌క్త‌హీన‌త, హైబీపీ త‌గ్గుతుంది. 
 
అలాగే పరగడుపున రాగి చెంబులో నీళ్లు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి మనం తినే ఆహారంలోని పోషకాలను ఎక్కువ శాతం గ్రహిస్తుంది. రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలో మలినాలు తగ్గుతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది.

ఈ చర్యవల్ల శరీరంలో ద్రవపదార్థాలను కోల్పోనీకుండా ఇన్‌ఫెక్షన్‌ను దరి చేరనీయదు. శరీరంలో కొత్త రక్తం తయారీకి కండరాలలో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.