1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. women beauty care tips with lemon and orange

సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని...?

సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని అందులో కొబ్బరి నూనెను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన పేలు తొలగిపోతాయి. నెయిల్ పాలిష్ గడ్డకట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని చుక

lemon
సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని అందులో కొబ్బరి నూనెను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన పేలు తొలగిపోతాయి. నెయిల్ పాలిష్ గడ్డకట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని చుక్కలు ఎసిటోన్‌ను కలుపుకోవాలి. నిమ్మతొక్కలను ఎండబెట్టుకుని వాటిని పొడిచేసుకుని ఆ మిశ్రమానంలో కొద్దిగా నీటిని కలుపుకుని తలకు రాసుకుంటే చుండ్రు సమస్యలుండవు.
 
ఐబ్రో పెన్సిల్స్ విరిగిపోకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచుకోవాలి. ప్రతిరోజూ రెండు గ్లాసుల క్యారెట్ జ్యూస్‌ను తీసుకుంటే కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. గోళ్ళను నిమ్మరసంతో ప్రతిరోజూ మర్దన చేసుకుంటే గోళ్ళు మృదువుగా, కాంతివంతంగా ఉంటాయి. చెవి దిమ్మెల రంధ్రాలు చిన్నగా ఉండి ఇబ్బందనిపిస్తే కాస్త పెట్రోలియం జెల్లీని చెవి రంధ్రాలకు రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
పగిలిన పెదవులకు రెండు లేదా మూడు చుక్కల గ్లిజరిన్‌ను ప్రతిరోజూ మసాజ్ చేసుకుంటే పేదాలు పగలకుండా ఉంటాయి. మెంతికూర ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మురికి వదులుతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నారింజ తొక్కలను పొడిచేసుకుని అందులో తేనెను కలుపుకుని పెదాలకు రాసుకుంటే పెదాలు ఎర్రబడుతాయి. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
రసం పిండేసిన నిమ్మకాయ తొక్కలతో పచ్చడి...