నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?
ఈ కాలంలో చర్మం ఎలాంటి పరిస్థితులలో ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. చర్మం ఎక్కువగా పగులుతూ ఉంటుంది. దీంతో చర్మం తెల్లగా పేలినట్లు మారుతుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించాలంటే అందుకు రసాయనాలు కలిసిన క్రీమ
ఈ కాలంలో చర్మం ఎలాంటి పరిస్థితులలో ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. చర్మం ఎక్కువగా పగులుతూ ఉంటుంది. దీంతో చర్మం తెల్లగా పేలినట్లు మారుతుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించాలంటే అందుకు రసాయనాలు కలిసిన క్రీమ్‌లను, ఇతర పౌడర్లను వాడకూడదు. అందుకు నిదర్శనంగా ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే చర్మాన్ని, ముఖాన్ని సంరక్షించుకోవచ్చును. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపును కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని 20 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే చక్కని ఫలితాలను పొందవచ్చును.
స్నానానికి ముందు టమోటా రసాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారతుంది. రాత్రి పడుకునే ముందుగా ముఖానికి పాలు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మ సౌందర్యాన్ని పరిరక్షించేందుకు చక్కగా తోడ్పడుతుంది.
చందనపు పొడిలో కొద్దిగా రోజ్ వాటర్‌ను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వలన కూడా ముఖచర్మం కాంతివంతంగా మారుతుంది.