సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (18:04 IST)

కలబంద ఆకుల మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

చాలామందికి ఎక్కువగా బయట తిరగడం వలన ముఖంపై జిడ్డు, మురికి ఏర్పుడుతుంటాయి. మరికొంతమందికి ఎప్పుడూ ముఖం జిడ్డుగానే ఉంటుంది. దీంతో మెుటిమలు, మచ్చలు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలో జిడ్డును, మురికిని పోగ

చాలామందికి ఎక్కువగా బయట తిరగడం వలన ముఖంపై జిడ్డు, మురికి ఏర్పుడుతుంటాయి. మరికొంతమందికి ఎప్పుడూ ముఖం జిడ్డుగానే ఉంటుంది. దీంతో మెుటిమలు, మచ్చలు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలో జిడ్డును, మురికిని పోగొట్టేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు, మురికి పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. కలబంద ఆకులను నీటిలో వేసి మరిగించుకోవాలి. ఈ ఆకులను మిశ్రమంలా తయారుచేసుకుని అందులో కొద్దిగా తేనెను కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా చేయడం ముఖం మృదువుగా మారుతుంది. కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు, కీరదోస రసం, రోజ్‌వాటర్‌ను కలుపుకుని ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
కలబంద గుజ్జులో కొద్దిగా ఓట్స్, కీరదోస తురుమును వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 3 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు, మురికి తొలగిపోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది.