మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (17:17 IST)

రసం పిండేసిన నిమ్మకాయ తొక్కలతో పచ్చడి...

ఒక సీసాలో కొద్దిగా పసుపును వేసుకుని అందులో పచ్చిమిరపకాయలను పెట్టుకుంటే అవి ఎరుపు రంగు మారకుండా ఉంటాయి. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలను వేసుకుంటే వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరకుండా ఉంటుంది. పెరుగు పుల్లగా మారకుండా ఉంటాలంటే అందులో కొబ్బరిముక్కను వ

ఒక సీసాలో కొద్దిగా పసుపును వేసుకుని అందులో పచ్చిమిరపకాయలను పెట్టుకుంటే అవి ఎరుపు రంగు మారకుండా ఉంటాయి. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలను వేసుకుంటే వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరకుండా ఉంటుంది. పెరుగు పుల్లగా మారకుండా ఉంటాలంటే అందులో కొబ్బరిముక్కను వేసుకుంటే బాగుంటుంది.
 
ఎండిపోయిన వెల్లుల్లిపాయలను పొట్టుతీసి సన్నని మంటమీద వేయించి పొడిచేసుకుంటే వాటిని పచ్చళ్ళలో, పప్పు, రసం మెుదలైన వాటిలో ఉపయోగించవచ్చును. వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వాటిని కాసేపు ఎండలో ఉంచుకోవాలి. 
 
రసం పిండివేసిన నిమ్మకాయలను సన్నని ముక్కలుగా తరిగి వాటిని ఆవిరి మీద ఉడికించి దానికి కొంచెం ఉప్పు, కారం, బెల్లం కలుపుకుని పోపు వేసుకోవాలి. దీంతో నిమ్మకాయ పచ్చడి రెడీ. మిగిలిన అన్నంలో కొద్దిగా శెనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకుని బాగా మెత్తగా రుబ్బి దోసెల్లాగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా వడియాలు, చిప్స్‌గా కూడా చేసుకోవచ్చును.