శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (14:00 IST)

ప్రతిరోజూ నువ్వులను ఆహారంలో చేర్చుకుంటే?

నువ్వులలో జింక్, క్యాల్షియం, పాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి చక్కగా ఉపయోగపడుతాయి. ప్రతిరోజూ వీటిని తరచుగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును. అంతేకాకుండా రక్తపోటు సమస్యలకు నువ్వులు మంచి ఔషధంగా సహా

నువ్వులలో జింక్, క్యాల్షియం, పాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి చక్కగా ఉపయోగపడుతాయి. ప్రతిరోజూ వీటిని తరచుగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును. అంతేకాకుండా రక్తపోటు సమస్యలకు నువ్వులు మంచి ఔషధంగా సహాయపడుతాయి.
 
గుమ్మడి విత్తనాలలో మాంసకృతులు ఎక్కువుగా ఉంటాయి. శరీరానికి కావలసిన మెగ్నిషియం, జింక్, క్యాల్షియం, పాస్పరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ గుమ్మడి గింజలను తీసుకోవడం వలన హృద్రోగాలకు దూరంగా ఉండవచ్చును. సెరటోనిన్ స్థాయిలను పెంచుటకు చక్కగా ఉపయోగపడుతాయి. 
 
అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల ఆరోగ్యానికి మంచిగా దోహదపడుతాయి. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులకు అవిసె గింజలను తీసుకుంటే తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి అవిసె గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి.