సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: బుధవారం, 15 ఆగస్టు 2018 (20:25 IST)

అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం ఎలా వుంది? తెలుసుకున్న ప్రధాని

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉందా...? బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మాజీ ప్రధాని అటల్ ఎయిమ్స్ చేరాక ప్రధాని ఆసుపత్రికి వెళ్లి వాకబు చేయడం ఇది నాలుగోసారి.

కాగా అటల్ బిహారీ వాజ్‌పేయి శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఎయిమ్స్‌ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతలూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎయిమ్స్‌కు తరలి వస్తున్నారు. 
 
ఇదిలావుండగా, వాజపేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంతమాత్రంగా పనిచేస్తున్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.