ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (18:21 IST)

మోదీ మూర్ఖుడు.. చెప్తే అర్థం చేసుకునే రకం కాదు.. జేసీ సెన్సేషనల్ కామెంట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ చెప్తే అర్థం చేసుకునే రకం కాదని ఏకిపారేశారు. మోదీలో నిరంకుశత్వం పెరిగిపోయిందని, ఆయన మూర్ఖుడని జేసీ తీవ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ చెప్తే అర్థం చేసుకునే రకం కాదని ఏకిపారేశారు. మోదీలో నిరంకుశత్వం పెరిగిపోయిందని, ఆయన మూర్ఖుడని జేసీ తీవ్రంగా మండిపడ్డారు. మోదీ వద్ద ఉన్న మంత్రులు కూడా అటువంటి వారేనని జేసీ ధ్వజమెత్తారు. 
 
రైల్వే, ఆర్థిక మంత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని జేసీ తెలిపారు. మోదీ ప్రభుత్వం నుంచి ఏపీ ఏమీ సాధించలేదని జేసీ స్పష్టం చేశారు. ఇకపై కేంద్రం నుంచి ఏపీ ఏదో సాధిస్తుందనుకునే పప్పులో కాలేసినట్లేనని జేసీ అన్నారు. ఎంపీగా తానైతే సంతృప్తిగా లేనని జేసీ పేర్కొన్నారు. ఓ ఎంపీగా తాను నిర్వర్తించాల్సిన విధుల పట్ల తనకు ఏమాత్రం సంతృప్తి లేదన్నారు. 
 
ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని జేసీ అన్నారు. ఎంతసేపటికీ నిరసనలతో సమయం సరిపోతుందని, ప్రతి పార్టీ నిరసనలకే పరిమితమవుతోందని జేసీ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గుతుందేమో కానీ, అదే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో టీడీపీకి 25 లోక్‌సభ స్థానాలు వస్తాయని జేసీ ఆశాభావం వ్యక్తం చేశారు.