సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (16:29 IST)

జాజికాయ చూర్ణంతో ఆ సామర్థ్యం పెరుగుతుందట..

జాజికాయ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. గోరువెచ్చని పాలలో నేతిలో వేయించి పొడి చేసుకున్న జాజికాయ చూర్ణాన్ని ఐదు గ్రాముల చొప్పున సాయంత్రం పూట తీసుకుంటే.. నరాల బలహీనత వుండదు. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంద

జాజికాయ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. గోరువెచ్చని పాలలో నేతిలో వేయించి పొడి చేసుకున్న జాజికాయ చూర్ణాన్ని ఐదు గ్రాముల చొప్పున సాయంత్రం పూట తీసుకుంటే.. నరాల బలహీనత వుండదు. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. నపుంసకత్వాన్ని తరిమి కొడుతుంది. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది. 
 
పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్‌లాగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి స్క్రబ్‌లా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.
 
అధిక దాహాన్ని అరికడుతుంది. అలసటవల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది. మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నియంత్రించడంలో జాజికాయ భేష్‌గా పనిచేస్తుంది. 
 
మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంతో పాటు ఆ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఒక చెంచా తేనె, చిటికెడు జాజికాయ పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని నిద్రించ‌డానికి పది నిమిషాల ముందు తాగితే.. నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.