శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (14:19 IST)

ఉప్పు నీటిలో దూదిని ముంచి కళ్ళకు మర్దన చేసుకుంటే?

ఉప్పు కలిపిన నీళ్ళను యాంటీ సెప్టిక్‌గా ఉపయోగించవచ్చును. ఇంట్లో మరో యాంటీ సెప్టిక్ ఏది లేకపోయినా రసికారే పుండ్లను ఉప్పునీటితో కడగవచ్చును. బ్యాండేజ్ గానీ, బట్టగానీ పుండుకు అంటుకుపోతే కూడా గోరువెచ్చని ఉప్పు నీటితో కడిగితే శుభ్రమవుతాయి. విషాహారాన్ని తిన్

ఉప్పు కలిపిన నీళ్ళను యాంటీ సెప్టిక్‌గా ఉపయోగించవచ్చును. ఇంట్లో మరో యాంటీ సెప్టిక్ ఏది లేకపోయినా రసికారే పుండ్లను ఉప్పునీటితో కడగవచ్చును. బ్యాండేజ్ గానీ, బట్టగానీ పుండుకు అంటుకుపోతే కూడా గోరువెచ్చని ఉప్పు నీటితో కడిగితే శుభ్రమవుతాయి. విషాహారాన్ని తిన్నప్పుడు గ్లాస్ నీటిలో ఉప్పును కలుపుకుని తీసుకుంటే అది విరుగుడుగా పనిచేస్తుంది.
 
అధిక రక్తపోటుగల వారు, హృద్రోగులు, కాళ్ళ వాపు, మూత్రపిండాల వ్యాధులేవైనా ఉన్నవారు ఉప్పును ఆహారంలో జాగ్రత్తగా తీసుకోవాలి. తాపంగా ఉన్న అవయవాలకు, కీళ్ళ నొప్పులకు ఉప్పు నీటి కాపడం చాలా ఉపయోగపడుతుంది. చాలా మందికి అప్పుడప్పుడు గొంతు పట్టుకుంటుంది. అలాంటప్పుడు చిటికెడు ఉప్పును నాలుకపై వేసుకుని చప్పరిస్తే గొంతు సాఫీగా ఉంటుంది.
 
చెడుశ్వాస, చిగుళ్ళ వాపు వంటి సమస్యలు ఉన్నవారు ఉప్పునీటిని పుక్కిలిస్తే చాలా మంచిది. కళ్ళకు ఎక్కువగా పుసులు కడుతుంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పును కలుపుకుని ఆ నీటిలో దూదిని ముంచి దానితో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చును.