శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (12:34 IST)

ఈ వంటింటి చిట్కాలు మీకోసం...

రవ్వదోసెలు వేసేటప్పుడు, దోసె వేశాక పైన క్యారెట్ తురుము, కొబ్బరి తురము, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయ ముక్కల్ని చల్లితే రవ్వ దోసెలు ఎంతో రుచిగా ఉంటాయి. బొంబాయి రవ్వ మిలిగిపోతే పారేయకుండా అందులో కొద

రవ్వదోసెలు వేసేటప్పుడు, దోసె వేశాక పైన క్యారెట్ తురుము, కొబ్బరి తురము, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయ ముక్కల్ని చల్లితే రవ్వ దోసెలు ఎంతో రుచిగా ఉంటాయి. బొంబాయి రవ్వ మిలిగిపోతే పారేయకుండా అందులో కొద్దిగా బియ్యపు పిండి కలిపి వడలుగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. దోసెలు వేసేటప్పుడు చిరగకుండా ఉండాలంటే ఆ పిండిని పట్టించేటప్పుడు దాంతో కప్పు సగ్గుబియ్యం వేసుకుని రుబ్బుకోవాలి.
 
జామ్ గడ్డకడితే అందులో బాగా వేడిచేసిన నీటిని కొద్దిగా పోసుకుంటే జామ్ మీరు కొన్నప్పుడు ఎలా ఉన్నదో అలా ఉంటుంది. కోడిగుడ్డులోని తెల్లసొను, పచ్చిసొనను తేలికగా వేరు చేయాలంటే గ్లాసులో ఒక గరాటును ఉంచి అందులోని గుడ్లను పగులగొట్టాలి. అప్పుడు తెల్లసొన గ్లాసులోకి జారుతుంది. పచ్చసొన గరాటులో ఉంటుంది.
 
పూరీలు చేసుకునేటప్పుడు పొంగాలంటే అందులో కొద్దిగా మైదా పిండిని కలుపుకోవాలి. అన్నం తెల్లగా ఉండాలంటే ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. టమోటాలు వడిలిపోయినట్లయితే వాటిని ఉప్పునీటిలో రాత్రంతా ఉంచితే తాజాగా మారుతాయి. వేడినీళ్ళు చల్లారకుండా ఉండాలంటే పాత్రమీద మూడు న్యూస్ పేపర్లు కప్పి ఉంచుకోవాలి.