మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (15:10 IST)

శొంఠిని సలసలా మరిగే నీళ్లలో కలిపి స్నానం చేస్తే?

శొంఠిని అరగదీసిన గంధాన్ని కణతలకు రాసుకుంటే తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. శొంఠి పొడిని బియ్యపు పిండిలో కలుపుకుని నుదిటి మీద పట్టీలా వేసుకుంటే కూడా తలనొప్పి నుండి విముక్తి చెందవచ్చును. శొంఠిని వేడినీళ్ళల్లో సలసల మరిగించుకుని ఆ తర్వాత గోరువెచ్చగా అయి

శొంఠిని అరగదీసిన గంధాన్ని కణతలకు రాసుకుంటే తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. శొంఠి పొడిని బియ్యపు పిండిలో కలుపుకుని నుదిటి మీద పట్టీలా వేసుకుంటే కూడా తలనొప్పి నుండి విముక్తి చెందవచ్చును. శొంఠిని వేడినీళ్ళల్లో సలసల మరిగించుకుని ఆ తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
 
శొంఠి ముక్కను నమిలి బుగ్గన పెట్టుకుంటే పంటి నొప్పులు, చిగురు నొప్పులు తగ్గుతాయి. అరలీటరు మంచినీళ్ళలో పది గ్రాముల శొంఠిని వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి ప్రతిరోజూ తీసుకోవడం వలన పొడిదగ్గు, విరేచనాలు వంటి సమస్యలు తొలగిపోతాయి. 
 
శొంఠి, జీలకర్ర, కొత్తిమీరను సమభాగాలుగా తీసుకుని నీళ్ళలో వేసి మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని వడబోసి చల్లార్చి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 10 గ్రాముల శొంఠిని అరగదీసి పులిసిన మజ్జిగలో కలుపుకుని ప్రతిరోజూ మూడు పూటలా తాగితే కడుపుకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి.