శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (16:33 IST)

భోజనానంతరం తరువాత ఆ పండ్లను తీసుకుంటే?

భోజనం చేసిన తరువాత కొన్ని పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి భోజనం చేశాక తినాల్సిన పండ్లు ఏమిటో ఇప

భోజనం చేసిన తరువాత కొన్ని పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి భోజనం చేశాక తినాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
యాపిల్ పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి యాపిల్ పండు తరచుగా ఆహారంగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండ్లు భోజనానంతరం తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వలన శరీర శక్తి అధికమవుతుంది.  
 
బొప్పాయి అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన శక్తి కూడా అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

అంజీర్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్ర పరిచి వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఈ పండ్లను తినడం వల్ల తక్షణమే శక్తి కూడా లభిస్తుంది.