ప్రతిరోజూ ఉదయాన్నే రాగి అంబలిని తీసుకుంటే?
రాగులను మెుక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసుకుని ఉడికించి జారుగా తయారుచేసిన ఆహారపదార్థం అంబలి. ఇందులో రుచికోసం జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు, పచ్చకర్పూరం, జాజికా, కిస్మిన్ వంటివి కూడా
రాగులను మెుక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసుకుని ఉడికించి జారుగా తయారుచేసిన ఆహారపదార్థం అంబలి. ఇందులో రుచికోసం జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు, పచ్చకర్పూరం, జాజికా, కిస్మిన్ వంటివి కూడా కలుపుకోవచ్చును. అలాకాకుంటే ఉప్పు, కారం కొద్ది మోతాదులో మసాలా కూడా వేసుకోవచ్చును.
రాగి అంబలి శరీరానికి బలాన్నిస్తుంది. ఎదిగే పిల్లలకు శక్తివంతమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు, షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. శరీర వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా సహాయపడుతుంది. రక్తస్రావంలోని ఇబ్బందులను తొలగిస్తుంది.
ధ్యాన్యాలలోకెల్లా రాగులు చాలా మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. బియ్యపుపిండితో కూడా అంబలిని తయారుచేసుకోవచ్చును. క్యాలరీలను పెంచుటలో చక్కగా పనిచేస్తుంది. స్థూలకాయ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంగా రాగి అంబలిని తీసుకోవడం వలన శరీర దృఢత్వం పెరుగుతుంది.