శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (13:17 IST)

పైనాపిల్ తీసుకుంటే మూత్రపిండాల్లోని రాళ్లకు?

పైనాపిల్లోని బ్రొమిలైన్ అనే ఎంజైమ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గాయాలైనప్పుడు పైనాపిల్‌ను తీసుకుంటే నొప్పి, వాపు, మంట వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. పైనాపిల్‌లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఆర్థరైటిస్ వంటి అనేక జబ్బుల్లో వచ

పైనాపిల్లోని బ్రొమిలైన్ అనే ఎంజైమ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గాయాలైనప్పుడు పైనాపిల్‌ను తీసుకుంటే నొప్పి, వాపు, మంట వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. పైనాపిల్‌లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఆర్థరైటిస్ వంటి అనేక జబ్బుల్లో వచ్చే నొప్పి, మంట వంటి వాటిని కూడా సమర్థవంతంగా అరికడుతుంది.
 
పైనాపిల్‌లోని విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా సహాయపడుతుంది. శ్వాసవ్యవస్థకు సంబంధించిన వ్యాధులను నివారించుటకు చక్కగా పనిచేస్తుంది. ఆస్తమా వంటి వ్యాధులు దరిచేరవు. వాయునాళాల్లో మ్యూకస్ అతిగా పెరగడాన్ని అదుపు చేస్తుంది. కఫాన్ని తగ్గిస్తుంది.  
 
పైనాపిల్‌లో పొటాషియం పుష్కలంగా ఉండడం వలన అధిక రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. అలసటను, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తనాళాలలో రక్తం సాఫీగా ప్రవహించడానికి తోడ్పడుతుంది. హైబీపీ అనర్థాలను తగ్గిస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను సహజసిద్ధంగా తొలగిస్తుంది.