శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (14:16 IST)

శరీర వేడిని తగ్గించుటకు కొత్తిమీరను తీసుకుంటే?

సువాసనలు వెదచల్లే కొత్తమీరను ఉపయోగించని వారుండరు. ఆహార పదార్థాలలో, ఫలహారాలలో కూడా కొత్తిమీరను ఉపయోగించడం వలన వాటి రుచి మరింత పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా కొత్తిమీర మంచిగా ఉపయోగపడుతుంది. కొత్తమీర శరీరంలో గల వేడిని తగ్గించుటలో చక్కగా పనిచే

సువాసనలు వెదచల్లే కొత్తమీరను ఉపయోగించని వారుండరు. ఆహార పదార్థాలలో, ఫలహారాలలో కూడా కొత్తిమీరను ఉపయోగించడం వలన వాటి రుచి మరింత పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా కొత్తిమీర మంచిగా ఉపయోగపడుతుంది. కొత్తమీర శరీరంలో గల వేడిని తగ్గించుటలో చక్కగా పనిచేస్తుంది.
 
శరీరంలోని ఉష్ణతాపాన్ని తగ్గిస్తుంది. కఫం, వాత, పైత్యాలను పూర్తిగా నివారిస్తుంది. ఆకలిని పెంచుటలో కొత్తిమీర దివ్యౌషధంగా పనిచేస్తుంది. కొత్తిమీర కషాయంలో పాలు, చక్కెరను కలుపుకుని ప్రతిరోజూ తీసుకోవడం వలన అజీర్తి వంటి సమస్యలుండవు. జలుబుతో బాధపడుతున్నవారికి తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటప్పుడు కొత్తిమీరను వాసను చూసుకుంటే తుమ్ములు తగ్గుతాయి. 
 
తద్వారా జలుబు కూడా తొలగిపోతుంది. కొత్తిమీరను ఆహారంలో తరచుగా చేర్చుకోవడం వలన కడుపులో వాయువు చేరనివ్వదు. కొంతమందికి దాహం అధికంగా ఉంటుంది. ఈ దాహాన్ని అరికట్టడంలో కొత్తిమీర మంచిగా దోహదపడుతుంది. గర్భిణులు నొప్పులు వచ్చే సమయంలో కొత్తిమీరను వాసన చూస్తే లేదా వాటిని దగ్గరే ఉంచుకుంటే త్వరగా ప్రసవమవుతుంది. ప్రసవించిన వెంటనే కొత్తిమీరను అక్కడ నుండి తీసివేయాలి.