శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 13 అక్టోబరు 2018 (20:36 IST)

అదేమి నటనండీ బాబూ... ఎన్టీఆర్ పైన అక్కినేని హీరో

ఎన్టీఆర్ (తార‌క్) న‌ట‌న గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంత గొప్ప న‌టుడో అంద‌రికీ తెలిసిందే. తాజాగా అర‌వింద స‌మేత‌.. వీర రాఘ‌వ మూవీలో అద్భుతంగా న‌టించి మ‌రోసారి శ‌భాష్ అనిపించుకున్నాడు. ఈ నెల 11న అర‌వింద స‌మేత‌... ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్టీఆర్ అభిన‌యం, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వ మాయాజాలం విశేషంగా ఆక‌ట్టుకుంటుండ‌టంతో ప్రేక్ష‌కులు, సినీ ప్ర‌ముఖులు అర‌వింద స‌మేత టీమ్ పైన ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... అక్కినేని హీరో అఖిల్ ఎన్టీఆర్ ఎంత గొప్ప న‌టుడో ఈ సినిమా మ‌రోసారి గుర్తు చేసింది. నిజంగా ఎన్టీఆర్ న‌ట‌న అద్భుతంగా ఉంది. డైరెక్టర్ త్రివిక్ర‌మ్ గారికి హ్యాట్సాఫ్‌. మ్యూజిక్ డైరెక్టర్ తమ‌న్ ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు. టీమ్‌కి అభినంద‌న‌లు. ఈ విజ‌యాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి అని అఖిల్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అదీ సంగ‌తి!