శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 13 అక్టోబరు 2018 (16:27 IST)

ఇంకెందుకాలస్యం... ఎన్టీఆర్ ఫ్యాన్స్ తొడకొట్టేయండి... శ్రీరెడ్డి కామెంట్స్

శ్రీరెడ్డి అనగానే క్యాస్టింగ్ కౌచ్ పైన ఉద్యమం అనేదే గుర్తుకు వస్తుంది. ఐతే తాజాగా ఆమె ఎన్టీఆర్ చిత్రం అరవింద సమేతపై చేసిన పోస్టులు ఆశ్చర్యకరంగా మారాయి. ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడే శ్రీరెడ్డి ఇలా మాట్లాడేందేమిటా అని చర్చించుకుంటున్నారు.
 
ఇంతకీ ఆమె ఏమి పోస్టు చేసిందంటే... ఇంకెందుకు ఆలస్యం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ తొడ కొట్టండి. అరవింద సమేత చాలా చాలా బాగుంది ఎన్టీఆర్ గారూ... ఆడవారి గురించి చాలా బాగా చెప్పారు త్రివిక్రమ్ గారూ అంటూ పోస్టు చేసింది. ఐతే శ్రీరెడ్డి చేసిన ఈ పోస్ట్ పొగడ్తా లేదంటే విమర్శా అంటూ నొసలు ఎగరేస్తున్నారు. ఏదైతేనేం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం అరవింద సమేత చిత్రం హిట్ ఎంజాయ్ లో వున్నారు. ఇదంతా వారు పట్టించుకునే దశలో లేరు.