1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sri Reddy Comments On Keerthi Suresh laugh

'మీ నవ్వు చాలా అసహ్యంగా ఉంది.. మరచిపోను'... 'మహానటి'ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి శ్రీరెడ్డి. హైదరాబాద్‌లో రక్షణ లేదని పేర్కొంటు తన మకాంను ఇపుడు చెన్నైకు మార్చింది. అక్కడ కూడా ఆమె తన ఇంటికి పరిమితం కావడం లేదు. కోలీవుడ్ అగ్ర

Sri Reddy
క్యాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి శ్రీరెడ్డి. హైదరాబాద్‌లో రక్షణ లేదని పేర్కొంటు తన మకాంను ఇపుడు చెన్నైకు మార్చింది. అక్కడ కూడా ఆమె తన ఇంటికి పరిమితం కావడం లేదు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో పాటు నటుడు రాఘవ లారెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది.
 
అదేసమయంలో తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "రెడ్డి డైరీ" చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నటుడు విశాల్‌ తాను నటించిన "సండైకోళి–2" (పందెంకోడి-2) చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటి శ్రీరెడ్డికి అవకాశం వచ్చింది. అంతేకాదు ఇకపై ఆమెతో నటించేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమె తన రక్షణ కోసం కెమెరా దగ్గరే ఉంచుకుంటారని ఈ చిత్ర హీరో విశాల్ వ్యాఖ్యానించారు. 
 
ఆ మాటలకు నటి కీర్తి సురేష్ నవ్వు ఆపుకోలేక.. ఫక్కున నవ్వేశారు. ఈ నవ్వు శ్రీరెడ్డికి ఎక్కడలేని ఆగ్రహం తెప్పించింది. విశాల్‌కు థ్యాంక్స్‌ చెబుతూ నటి శ్రీరెడ్డి ఇటీవల ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేసింది. అందులో నటి కీర్తీసురేశ్‌ నవ్వడం గురించి పేర్కొంటూ "మీ నవ్వు చాలా అసహ్యంగా ఉంది. ఏం చింతించకండి మేడమ్‌ మీరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండలేరు. పోరాడేవారి బాధేంటో మీకూ ఒక రోజు తెలుస్తుంది. గుర్తుంచుకోండి. నేనూ మీ నవ్వును మరచిపోను. మీరిప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నట్టున్నారు" అని పేర్కొంది. శ్రీరెడ్డి ట్వీట్‌పై కోలీవుడ్‌లో  చర్చనీయాంశంగా మారింది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రూటు మార్చిన ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్..!