గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (18:15 IST)

శ్రీరెడ్డితో నటించే నటులు జాగ్రత్త- విశాల్

తమిళం, తెలుగు సినీ ప్రముఖులకు చుక్కలు చూపించిన శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమా షూటింగ్‌ల్లో బిజీ బిజీగా వుంది. క్యాస్టింగ్ కౌచ్‌పై అర్ధనగ్న ప్రదర్శనతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల పేర్లను బహిర్గతం చే

తమిళం, తెలుగు సినీ  ప్రముఖులకు చుక్కలు చూపించిన శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమా షూటింగ్‌ల్లో బిజీ బిజీగా వుంది. క్యాస్టింగ్ కౌచ్‌పై అర్ధనగ్న ప్రదర్శనతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల పేర్లను బహిర్గతం చేయడం ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు జంప్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన బయోపిక్‌లో నటిస్తోంది. ఆపై రెండు సినిమాల్లో శ్రీరెడ్డి నటిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ప్రశ్నకు నటుడు విశాల్ ఇచ్చిన సమాధానానికి కృతజ్ఞతలు తెలిపింది. విశాల్ తన పందెంకోడి 2 ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ.. శ్రీరెడ్డికి తమిళ సినిమాల్లో నటించేందుకు అవకాశం లభించడం హ్యాపీ. అయితే ఆమెతో నటించే నటులు చాలా జాగ్రత్తగా వుండాలి. ఏవైనా తప్పులు జరగకుండా వుండేందుకు.. ఆమె చుట్టూ కెమెరాలు పెట్టేసే ప్రమాదముందని చమత్కరించాడు. 
 
విశాల్ ఈ మాటలకు శ్రీరెడ్డి థ్యాంక్స్ చెప్పింది. అంతేగాకుండా శ్రీరెడ్డికి ఛాన్సులు రావడంతో క్యాస్టింగ్ కౌచ్‌పై ఇక మాటెత్తదని సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకుంటున్నారు.