శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (17:23 IST)

షరీఫ్ ఇంట్లో మోడీ టీ తాగి వచ్చారు.. అపుడు నోరు మెదపలేదే? : నవజ్యోత్ సింగ్ సిద్దూ

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ బజ్వాను తాను ఆలింగనం చేసుకోవడంపై వస్తున్న విమర్శలపై పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ స్పందించారు. ఈ ఆలింగనంపై వివాదం అక్కర్లేదన్నారు. "2015లో ప

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ బజ్వాను తాను ఆలింగనం చేసుకోవడంపై వస్తున్న విమర్శలపై పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ స్పందించారు. ఈ ఆలింగనంపై వివాదం అక్కర్లేదన్నారు. "2015లో ప్రధాని నరేంద్ర మోడీ లాహోర్‌కు వెళ్లి.. నాటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు. షరీఫ్ ఇంట్లో టీ తాగారు. దానికేమంటారు? పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌కు భారత సిక్కులకు సులువుగా అనుమతించే ఆలోచన చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్‌ బజ్వా చెప్పినపుడు తాను భావోద్వేగానికి లోనై.. నా తక్షణ స్పందనగా ఆయన్ను ఆలింగనం చేసుకున్నట్టు సిద్దూ చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో తాను అలా నడుచుకోవడంలో ఎలాంటి తప్పులేదంటూ తన చర్యను ఆయన సమర్థించుకున్నారు.
 
కాగా, సిద్దూ వ్యవహారశైలిని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా తప్పుబట్టిన విషయం తెల్సిందే. అయితే ఆ ఆలింగనం అనేది ఆయన వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికిగానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. 
 
మరోవైపు, హిందూ సంస్థలు మాత్రం నవజ్యోత్ సింగ్ సిద్దూ తలకు వెలకట్టారు. సిద్దూ తల తెగనరికి తెచ్చిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించాయి. దీంతో ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.