మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 3 నవంబరు 2018 (21:42 IST)

చిరంజీవిగారు ఆ పని చేస్తానంటే బయటకొచ్చా... ఇప్పుడు బాబు వారి కాళ్లు పట్టుకుంటే ఏం చేయాలి?

2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు కోపం, ఆవేద‌న వ‌చ్చాయి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... తోటి ఆంధ్రులపై చ‌ట్ట‌స‌భ‌ల్లో దాడులు చేసి బ‌య‌టికి గెంటేసి విభ‌జించారు. అందుకే కోపం వ‌చ్చింది. ఒక్క సంత‌కంతో తెలంగాణ‌లో ఉన్న బీసీ కులాలు, ఓసీలుగా మారిపోయారు. వారికి ఉన్న స‌దుపాయాలు, రిజ‌ర్వేష‌న్లు పోయాయి. 
 
చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటే, విబేధించి బ‌య‌టికి వ‌చ్చా. తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చా. ఇంత చేస్తే ముఖ్య‌మంత్రి వెళ్లి కాంగ్రెస్ కాళ్లు ప‌ట్టుకున్నారు. టీడీపీ నాయ‌కుల్ని పార్ల‌మెంటులో కొట్టారు, ఎంపి శివ‌ప్ర‌సాద్ కొర‌డాల‌తో కొట్టుకున్నారు. నెహ్రూ లాంటి నాయ‌కులు కూర్చున్న పార్ల‌మెంటు హాల్లో. 
 
వ్యాపారులు ఎంపిలుగా కూర్చుంటే వ్య‌వ‌స్థ ఇలాగే వుంటుంది. ఓ వ్య‌క్తి గురించి మాట్లాడితే ఆ కులం వారు ఓటు వేయ‌రు అంటారు. త‌ప్పులు చేసి కులాల ముసుగులో దాక్కోవాల్సిన అవ‌స‌రం ఏముంది.? స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే ప్ర‌జా కోర్టులో నిల‌బెడ‌తాం అని అన్నారు.