సైకిల్ గెలుపు కోసం అల్లు అర్జున్ తెలంగాణలో ప్రచారం..?

allu arjun
జె| Last Modified సోమవారం, 5 నవంబరు 2018 (18:21 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైకిల్‌కు ప్రచారం చేయబోతున్నారా. తెలంగాణా రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం నుంచి గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా అల్లు అర్జున్ మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయగా ఈసారి ఆయనకు టిక్కెట్టు రాలేదు. అయితే టిడిపి నుంచి పోటీ చేయడానికి చంద్రశేఖర్ రెడ్డి సిద్ధమయ్యారు. తన అల్లుడు సపోర్ట్ కూడా కోరారట చంద్రశేఖర్ రెడ్డి. మామ కోరిక మేరకు అల్లు అర్జున్ తెలంగాణా ఎన్నికల ప్రచారంలో టిడిపి తరపున చేసేందుకు సిద్థమవుతున్నాడట.
 
2014 టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు చంద్రశేఖర్ రెడ్డి. అయితే ఓడిపోయారు చంద్రశేఖర్. ఈ ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ఆశించారు. కానీ ఆయనకు కాకుండా వేరే వ్యక్తికి టిక్కెట్టు ఇవ్వడంతో చంద్రశేఖర్ రెడ్డి ఎలాగైనా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. 
 
కానీ మహాకూటమిలో చేరి టిడిపి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలన్నదే చంద్రశేఖర్ రెడ్డి ఆలోచన. దీంతో తన అల్లుడి సహకారం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండుమూడురోజుల్లో అల్లు అర్జున్ తన మామ తరపున తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :