ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నా.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ

Last Updated: మంగళవారం, 6 నవంబరు 2018 (15:36 IST)
టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలకడమే తన లక్ష్యమని ప్రకటించారు.  1994లో తొలిసారి జగిత్యాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి రమణ గెలుపొందారు. ఇక మహాకూటమి లోకి మరో పార్టీ వచ్చి చేరింది. ప్రస్తుతం కూటమిలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్ ఇండియా ముస్లిం నేషనల్ లీగ్ పార్టీ కూడా చేరింది. 
 
ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ మహాకూటమికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో ముస్లింలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అయితే ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. 
 
మరోవైపు.. మహాకూటమిలో పొత్తుల వ్యవహారం రెండు మూడు రోజుల్లో తేలకుంటే 9 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదని, సీట్ల సర్దుబాటు త్వరగా పూర్తి కావాలని, ఇంకా ఆలస్యమైతే సమస్యలు వస్తాయని అన్నారు. సీపీఐ పోటీ చేసే 9 స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థుల ప్రతిపాదనలు పెట్టామని అన్నారు.దీనిపై మరింత చదవండి :