అరవింద సమేతలో హరికృష్ణ గురించి బాలయ్య ఉద్వేగం(Video)
యంగ్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ భారీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్‌లను ఒకే వేదికపై చూసి అభిమానులు కేరింతలు కొట్టడంతో శిల్ప కళావేదిక అంతా మారు మ్రోగిపోయింది.
ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ... ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన తెలుగు దేశం పార్టీ చైతన్య రథ సారథి నందమూరి హరికృష్ణ. ఆయన మరణం నా మనసును ఎంతో బాధ పెట్టింది. ఆయన ఎంతో ముక్కుసూటితనం కలిగిన వ్యక్తి. అనుకున్నది సాధించడానికి లాభ నష్టాల బేరీజు వేయకుండా ముందుకు వెళ్తారు. ఆయన మన మధ్య లేరంటే నమ్మశక్యం కావడం లేదు.
టీడీపీ స్థాపించిన తొలి రోజుల్లో ఆయన నాన్నకు చేదోడువాదోడుగా ఉంటూ తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు. చైతన్య రథ సారథిగా ప్రజల్లోకి వెళ్లారు. నాన్నగారి మరణం తర్వాత హిందూపూర్‌లో అత్యధిక మెజారిటీతో రికార్డు సాధించిన ఘనత ఆయనదే. ఆయన రవాణా మంత్రిగా ఉన్నప్పుడు రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్ తొలగించారు. మహిళలకు కండక్టర్ ఉద్యోగాలు కల్పించి ఉపాధి చూపారు అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. వీడియో...
జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తారక్ చేసే సినిమాలు చేయడం ఎవరి కల్లా కాదు. నేను లెజెండ్ సినిమాలో ఆడవాళ్ల గొప్పతనం తెలియచేసేలా ఓ డైలాగ్ చెప్పాను. అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా ఆడవాళ్ల గొప్పతనం గురించి ఉంటుంది. జూనీయర్ ఎన్టీఆర్ కూడా ఆడవాళ్ల గొప్పతనం తెలియచేసేలా ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు.