సంబంధిత వార్తలు
- బాలకృష్ణ 'వేటగాడు' వేషం అదిరిపోయింది...
- నవరసాలతో కూడిన చిత్రాలు మా వంశంతోనే సాధ్యం : బాలకృష్ణ
- డ్రగ్స్ తీసుకునే తనూశ్రీ.. ఈరోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతోంది : రాఖీసావంత్
- రాజమౌళి చిత్రం నుంచి తప్పుకుంటే నిర్మాతకు రూ.100 కోట్ల ఆఫర్.. నిజమా?
- తిరుమల వెంకన్నను వర్మ అలా వాడుకుంటున్నారా? తేడా కొడుతుందేమోననీ...(Video)
ఒకే వేదికపై బాలయ్య - ఎన్టీఆర్... సెట్ చేసింది ఎవరో తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. దసరా కానుకగా రిలీజ్ చేసిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ భారీ సక్సస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు.
బాలయ్య, ఎన్టీఆర్.. ఈ బాబాయ్ - అబ్బాయ్‌లను ఒకే వేదిక మీద చూడటం నందమూరి అభిమానులకు నిజమైన పండగ అని చెప్పచ్చు. అసలు.. బాబాయ్ - అబ్బాయ్‌లను ఓకే వేదిక పైకి తీసుకువచ్చింది ఎవరో కాదు. నందమూరి కళ్యాణ్ రామ్. అవును.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సినిమాలో హరికృష్ణ పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవల బాలయ్య, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ గ్యాప్‌లోనే కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్యతో అరవింద సమేత సక్సస్ మీట్‌కి రావాలని అడిగాట. అంతే.. కళ్యాణ్ రామ్ అడిగేసరికి బాలయ్య నో చెప్పకుండా వెంటనే ఎస్ అన్నాడట. అదీ.. బాలయ్య, ఎన్టీఆర్ కలయిక వెనకున్న అసలు కథ..!
