సంబంధిత వార్తలు
- నా హత్యకు ఓ రాజకీయ పార్టీ కుట్ర.. సుపారీ కూడా ఇచ్చింది: మమత బెనర్జీ
- 'నా పేరు సూర్య'పై కుట్ర... ఇది నిజమా..?
- ప్రదీప్ పెళ్లి చూపులు ఓవర్.. జ్ఞానేశ్వరి విన్నర్.. ఇక డుం డుం డుం.. ఎప్పుడు?
- పెళ్లి కోసం ఇటలీకి వెళ్తూ.. కెమెరాకు చిక్కిన ఆ ఇద్దరు?
- ఇంట్లోకి రాగానే... గట్టిగా కౌగిలించుకున్నాడు.. నేను కూడా..?
రోబో 2పాయింట్ఓకు తలనొప్పి.. తమిళ్ రాకర్స్ సవాల్..
పైరసీతో దర్శకనిర్మాతలకు పెద్ద తలనొప్పి తప్పలేదు. సినిమాలు విడుదలైన గంటల్లోనే నెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల గీత గోవిందం సినిమాకు సంబంధించిన సన్నివేశాలు నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌కు పైరసీ వెబ్‌సైట్ తమిళ్ రాకర్స్ సవాల్ విసురుతోంది. ఇప్పటికే హీరో విశాల్‌కు, తమిళ రాకర్స్‌కు మధ్య పెద్ద వారే జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సర్కార్ సినిమాపై కూడా తమిళ రాకర్స్ తమ పంజా విసిరారు. సినిమా బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సర్కార్‌పై తమిళ రాకర్స్ పంజా విసిరింది. ఈ సినిమా విడుదలైన గంటల్లోనే నెట్‌లో పెట్టేసింది. తాజాగా రోబో 2పాయింట్ఓ సినిమాపై తమిళ్ రాకర్స్ కన్నేసింది.
ప్రముఖ దర్శకుడు శంకర్ యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ సినిమాను నెట్లో పెట్టేస్తామంటూ సవాల్ విసిరింది. ఈ మేరకు తమిళ రాకర్స్ ఈ సినిమాకు సోషల్ మీడియా ద్వారా సవాల్ విసిరిందని.. దీంతో సినీ యూనిట్ పైరసీతో కలెక్షన్లు తగ్గిపోతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తర్వాతి కథనం
