ప్రదీప్ పెళ్లి చూపులు ఓవర్.. జ్ఞానేశ్వరి విన్నర్.. ఇక డుం డుం డుం.. ఎప్పుడు?

Last Updated: శనివారం, 10 నవంబరు 2018 (15:04 IST)
యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షో ముగిసింది. 14 మంది అమ్మాయిలతో జరిగిన ఈ షోలో జ్ఞానేశ్వరీ తన హస్కీ వాయిస్‌తో ప్రదీప్‌ను కట్టిపడేసింది. యాంకర్ ప్రదీప్ అన్నా... అతడి యాంకరింగ్ అన్నా చాలామంది చాలా చాలా ఇష్టంగా చూస్తారు.


అలాంటిది.. పెళ్లి చూపులు షోలో ఆయన సిగ్గుపడుతూ కనిపించి.. చివరికి జ్ఞానేశ్వరిని పెళ్లి చేసుకునేందుకు ఎంపిక చేశారు. ప్రదీప్‌ను ఓర కంటితో చూస్తూ.. అతనిని ఇబ్బంది పెట్టి.. జ్ఞానేశ్వరి ఓవరాక్షన్ చేస్తుందని.. విమర్శలు ఎదుర్కొన్న జ్ఞానేశ్వరి.. పెళ్లిచూపులు షో విజేతగా నిలిచింది.
 
రీతు చౌదరి, దీనా కృపా, మౌనిక, డయానా, చంద్రకళ, దివ్య అశోకరావు డెకాటే, చలిమిశెట్టి దివ్య, నెహా అజ్మల్, కోనేరు రమ్యక్రిష్ణ , అంబాల శ్రేయ , సాహితి, నవ్య సౌజన్య కనకాల, షేక్ షబీనా, జ్ఞానేశ్వరి కందిరేగుల అనే 14 మంది అమ్మాయిలతో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఈ షో ఫైనల్‌లో ప్రదీప్ జ్ఞానేశ్వరిని ఎంపిక చేసుకున్నాడు. 
 
అయితే ప్రదీప్ ఈ షోలో ఎంపిక చేసుకున్న జ్ఞానేశ్వరిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని.. గ్రూపులో జ్ఞానేశ్వరితో కనెక్ట్ అయ్యానని.. ఇక సింగిల్‌గా ఆమెతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. అలాగే జ్ఞానేశ్వరి కూడా ప్రదీప్ తనను వివాహమాడే సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపింది. దీనిపై మరింత చదవండి :