బుల్లితెర ప్రదీప్ 'పెళ్లి చూపులు'కి ట్రోలింగే ట్రోలింగ్... లడ్డూ కావాలా నాయనా...?

pradeep
జె| Last Modified బుధవారం, 10 అక్టోబరు 2018 (16:46 IST)
పెళ్ళి చూపులు పేరుతో బిగ్ బాస్ తరహా షోను ప్రారంభించిన యాంకర్ ప్రదీప్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ షో చుట్టూ వివాదాలు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రదీప్ పొట్టిగా ఉంటాడు… మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతనిలో ఏమి చూసి అమ్మాయిలు ఎగబడుతున్నారు… అంటూ ఆవేదనతో కొంతమంది యువతులు ప్రసారమవుతున్న టీవీ షోకే లేఖలు రాస్తున్నారట. వాటిలో కొన్ని ఇలా వున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
ప్రదీప్ పెళ్లిచూపులు.. ఎక్కడికి పోతున్నామో మనం అర్ధం కావడంలేదు.. ఏంటీ అర్ధం పర్థం లేని టీవీ షోస్..? జనాల్ని వెర్రివాళ్లను చెయ్యడం కాకపోతే.. డేటింగ్ మన సంస్కృతి కాదు కదా.. ఒకడేవడో స్వయంవరం ప్రకటిస్తే .. పొలోమంటూ ఆడపిల్లలు క్యూ కట్టడమా..? ఎంత సెలిబ్రిటీ, పేరున్న యాంకర్ అయినా.. అమ్మాయిలు వచ్చి మీద పడిపోవడమా..? లవ్ యూ.. ఎంత ముద్దు వస్తున్నావో.. నీ సొట్టబుగ్గలు ఎంత బావున్నాయో.. నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది..
 
ఛీ.. అసలు తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారో? అతను అందర్నీ పెళ్లి చేసుకోడుగా.. ఎవరినో ఒక్కరినే వరిస్తాడు.. మిగిలినవాళ్ళు ఇక్కడ వేసే వెకిలి వేషాలకు పెళ్లిళ్లు అవుతాయా..? ఎంత గారాబంగా పెంచినా, అమ్మాయిలు ఏదంటే అదేనా..? వద్దు అని వారించరా? గిఫ్టులు ఇవ్వడం, హగ్స్.. తెలుగు ఛానళ్లు దరిద్రాన్ని తెచ్చి మన డ్రాయింగ్ రూముల్లో డంప్ చేస్తున్నాయి. 
 
ఒక మగవాడి కోసం అంత వేలంవెర్రి వేషాలు వేస్తారా..? టీవీల్లో కనపడాలనే కోరికతోనా.. నిజంగా ప్రదీప్‌కి అంత సీన్ ఉందా అసలు? వేరే దేశాల నుండి, తెలుగు రాకపోయినా అతని కోసం నేర్చుకుని మరీ వచ్చామని చెప్పడం.. ఇదంతా డ్రామానా.. అమ్మాయిలకి ప్రదీప్ అంటే అంత క్రేజ్ ఉందా..? నాకు నమ్మబుద్ధి కావడంలేదు. ఈ చెత్త డ్రామాకి తల్లిదండ్రుల సపోర్ట్.. తమ కూతుళ్ళ వల్ల తాము కూడా సెలిబ్రిటీలు అవుతాము అనుకుంటున్నారేమో..?
 
ఈమధ్య ఆడపిల్లల తల్లిదండ్రుల ప్రవర్తన చాలా వియర్డ్‌గా ఉంటోంది.. ఎంత బాగా చదువుకొని, మంచి కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి సంబంధం అయినా.. ఏదో వంక పెట్టడమే.. ప్యాకేజీ ఎంత? ఓన్ హౌస్ ఉందా.. హైట్ 6 ఫీట్ ఉన్నాడా, అత్త, ఆడపడుచులు ఉన్నారా.. అంటూ ఎంత ఆరా తీస్తున్నారో… తమ కూతురు బీటెక్ మాత్రమే చదివినా, అబ్బాయి మంచి కాలేజీల్లో పీజీ చేసి.. పెద్ద పాకేజీ ఉన్న, మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చెయ్యాలి. అది కూడా తమ కూతురు యెస్ అంటేనే.. మొన్న నేను తెలిసిన వాళ్ళ అమ్మాయికి ఒక మంచి మ్యాచ్ చెప్పా.. ఒక్కడే అబ్బాయి, ఎం.ఎస్ చేసి, పెద్ద కంపెనీలో మంచి పాకేజీ, 4 ఇళ్లు.. ఒక కొత్త ఫ్లాట్, అబ్బాయి చాలా బావున్నాడు.. అమ్మాయి అనుకున్న దానికన్నా 1′ హైట్ తక్కువ.. తనకి 6 అడుగులు కావాలట, అబ్బాయి 5’11 ఉన్నాడు.. నచ్చలేదు అని చెప్పారు.
comments
మరి ప్రదీప్ మాచిరాజుకు ఏమి ఉన్నాయి ? డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు.. అంటే తాగుతాడు.. పొట్టి.. వెకిలి యాంకరింగ్.. ఏమి చూసి అమ్మాయిలు ఎగబడుతున్నారు? తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు? నాకు పరమ చిరాకు, అసహ్యం వేస్తోంది.. పైగా వీళ్ళందరికీ ఐక్యూ టెస్టులు.. ఇంతోటి రాజకుమారుడు దొరకడని.. ఈ అమ్మాయిలు పోటీ పడటం.. మంచి కుటుంబంలో పుట్టి, చదువుకుని, ఉద్యోగం చేసే అబ్బాయిలు వద్దు.. ఇలా ఉదయం నుండి మళ్లీ తెల్లారే వరకు స్టూడియోల్లో ఉండే ‘యాంకరు’ కావాలి.. ఆల్ ద బెస్ట్ అమ్మాయిలూ.. మీ అమ్మా నాన్నలకి కూడా..
 
అన్నట్టు కొసమెరుపు ఏమిటంటే హిందీలో వచ్చిన షోలలో ఇలాంటి పెళ్లిచూపులు ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్లంతా విడాకులు కూడా తీసుకున్నారు. మరి మాచిరాజు ప్రేమ ఇందుకు భిన్నంగా వుంటుందేమో?దీనిపై మరింత చదవండి :