బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 3 నవంబరు 2018 (15:18 IST)

''పెళ్లిచూపులు'' షోతో ప్రదీప్, సుమకు ఇబ్బందులు..?

ప్రముఖ యాంకర్ ప్రదీప్‌, యాంకర్ సుమలపై కేసు నమోదైంది. పెళ్లిచూపులు షోను నిలిపివేయాలని డిమాండ్ పెరిగిపోతోంది. ఈ ప్రోగ్రామ్ తొలుత నుంచి విమర్శలే ఎదురవుతున్నాయి. స్టార్ యాంకర్ సుమ ఈ ప్రోగ్రామ్‌లో భాగం కావడంతో ఎన్నడూ లేని విధంగా ఆమెపై కూడా నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.


తాజాగా రాయలసీమ మహిళా సంఘం ఈ షోని నిలిపివేయాలని ధర్నా చేశారు. కర్నూలులో శుక్రవారం కలెక్టరేట్ వద్ద కొందరు మహిళలు ప్రదీప్ పెళ్లిచూపులు షోని బ్యాన్ చేయాలని ధర్నా చేశారు.
 
ఆడవాళ్లని అంగడి సరుకుగా చేసే అవమానిస్తోన్న ప్రదీప్, సుమ, షో యాజమాన్యం మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్నారని సంఘం జిల్లా అధ్యక్షురాలు శకుంతల ఆరోపించారు. తెలుగు ప్రజల సంప్రదాయాలను, ఆచారాలకి భాగం కలిగించే విధంగా పెళ్లిచూపులు షో వుందని వారు మండిపడుతున్నారు. అంతేగాకుండా ప్రదీప్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని.. సుమతో పాటు టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.